Amaravati, Nov 1: సామాన్యుల్లోని అసమాన్యుల సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను గర్వకారణంగా నిలుస్తాయని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజంలో అసమాన్య సేవలు అందిస్తున్న ప్రముఖులు, మానవతా మూర్తులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున (వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్) అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు వివిరంచారు. ప్రత్యేక ఉన్న పురస్కారాలను వ్యక్తులుగా, సంస్ధలుగా వారు చేసిన గొప్ప సేవలకు గుర్తింపుగా ఇస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా జరిగిన వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మందికి (౩౦ సంస్థలకు) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ తో కలిసి అవార్డులు ప్రధానం చేశారు. వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్ధలకు 20 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేశారు.
దేశంలోనే ఎక్కాడా లేని విధంగా తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ అవార్డులతో మన సంస్కృతి, సంప్రదాయాలకు దశాబ్దాలుగా వారధులుగా ఉన్న వారిని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారధులను ఈ అవార్డుల్లో ప్రత్యేకంగా చేర్చినట్లు వివరించారు.
ఈ అవార్డులు వెనుకబాటుతనం, అణిచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, పాత్రికేయుల భిన్నమైన కళాలకు, గళాలకు మరింత దన్నుగా నిలుస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజ సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి ఈ అవార్డులు ప్రతీకగా నిలుస్తాయన్నారు. రాష్ర్ట అభివృద్ధికి ఎంతగానో క షి చేసిన ప్రియతమ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుపై ఈ అవార్డులు ఇవ్వడం ద్వారా ఆ మహానేతను మరోసారి గుర్తు చేసుకున్నట్లేనని వివరించారు.
వైఎస్సార్ మార్క్ పాలనతో జాతీయస్థాయి గుర్తింపు: గవర్నర్
అంధ్రప్రదేశ్ రాష్ర్ట అభివృద్ధికి దివంగత నేత వైఎస్సార్ విశేష కృషి చేశారని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కన్నారు. వైఎస్సార్ తన మార్క్ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని కొనియాడారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగింది. బహుళ ప్రతిభలు కలగలిసిన రాష్ట్రం మనది. కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ పుట్టి ప్రపంచ ఖ్యాతి పొందాయి. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష మధురం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గొప్ప వ్యక్తులు కలిగిన నేల నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అని గవర్నర్ వివరించారు. దివంగత నేత వైఎస్సార్ రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. 4 సార్లు ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు సీఎంగా పని చేశారని కొనియాడారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకుని దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారన్నారు. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేదల గుండెల్లో నిలిచారని కొనియాడారు.
డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రూ. 10 లక్షల నగదు బహుమతి, డాక్టర్ వైఎస్‌ఆర్ కాంస్య బొమ్మ, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని కలిగి ఉండగా, డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు రూ. 5 లక్షల నగదు బహుమతి, మెమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని కలిగి ఉంటుంది.
వైఎస్సార్ అవార్డు గ్రహీతల జాబితా
వ్యవసాయంలో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు:
1. ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెంకు చెందిన సోడెం ముక్కయ్య. అతను ఆదివాసీ జీడిపప్పు రైతుల ఉత్పత్తిదారు కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు
2. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన క్రుషీవల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీకి చెందిన ఎ.గోపాలకృష్ణ.
3. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలుపుల గ్రామానికి చెందిన జయప్ప నాయుడు. అతను అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు
4. కె.ఎల్.ఎన్. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని అమృత ఫల ప్రొడ్యూసర్స్ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మౌక్తిక
5. కట్టమంచి బాలకృష్ణ రెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా
లలిత కళలు మరియు సంస్కృతిలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు
1. ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్
2. ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి
లలిత కళలు మరియు సంస్కృతిలో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు:
1. రంగస్థల కళాకారుడు నాయుడు గోపి
2. కలంకారి క్రూసేడర్ పిచ్చుక శ్రీనివాస్
3. ఉదయగిరికి చెందిన షేక్ గౌసియా బేగం చెక్క కత్తిపీట వాయిద్యాలకు మార్గదర్శకత్వం వహించారు.
సాహిత్యంలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు:
1. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ -టి. మనోహర్ నాయుడు
2. ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ -విజయకుమార్
3. రచయిత డాక్టర్ శాంతి నారాయణ.
మహిళా సాధికారత మరియు రక్షణలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు:
1. ప్రజ్వల ఫౌండేషన్‌కు చెందిన సునీతా కృష్ణన్
2. వుయ్యూరు శిరీషా పునరావాస కేంద్రం – మన్నె సోమేశ్వరరావు
5 దిశ పోలీసు అధికారులకు సంయుక్తంగా వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు:
రావాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజత్రయ్య
మరియు పి. శ్రీనివాసులు
విద్యలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు:
1. రిషి వ్యాలీ విద్యా సంస్థ, మదనపల్లి -డాక్టర్ అనంత జ్యోతి
2. జవహర్ భారతి విద్యాసంస్థ, కావలి – డాక్టర్ డోట్ల వినయకుమార రెడ్డి
3. వ్యక్తిత్వ వికాస శిక్షకుడు బి.వి.పట్టాభిరామ్
విద్యలో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు:
1. నంద్యాల నుండి దస్తగిరి రెడ్డి, వేలాది మంది బ్యాంక్ ఉద్యోగాలు ఆశించే వారికి శిక్షణ ఇచ్చారు-శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్
జర్నలిజంలో వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు
1. భండారు శ్రీనివాసరావు
2. సతీష్ చంద్ర
3. మంగు రాజగోపాల్
4. ఎంఈవీ ప్రసాద రెడ్డి
వైద్య మరియు ఆరోగ్యంలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు:
1. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి చెందిన డాక్టర్ బి. నాగేశ్వర రెడ్డి
2. శాంత బయోటెక్ డాక్టర్ వరప్రసాద రెడ్డి
3. భారత్ బయోటెక్‌కి చెందిన డాక్టర్ కృష్ణ యెల్లా మరియు సుచిత్ర యెల్లా
4. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్. సంగీత రెడ్డి
5. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నుండి గుళ్లపల్లి నాగేశ్వరరావు
పరిశ్రమల విభాగంలో వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు:
గ్రంథి మల్లికార్జునరావు.