Liquor Bottles | Image used for representational purpose only | Photo- Pixabay

Amaravati. Sep 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్రమ మద్యం దందా పెద్ద తలనొప్పిగా మారింది . తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నా రకరకాల మార్గాల ద్వారా మద్యం దందా సాగుతుంది. కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు గుర్తించారు. తాజాగా అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుబడింది. వాటర్‌ ట్యాంకులో (Liquor Bottles in Water Tank) దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను (10-thousand liquor bottles) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మద్యం దాచిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అ‍మ్మకాలపై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఏకంగా కొరియర్‌ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమ మద్యం దందా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ (Telangana) నుంచి కొరియర్‌ ద్వారా మద్యం తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు తేల్చారు. పక్క రాష్ట్రం నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు, స్పష్టం చేసిన హైకోర్టు, జీవో 411 అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు

ఇక ఈ మధ్య గుంటూరు జిల్లాలో  తెలంగాణ నుండి ఆంధ్రాకు గడ్డి లోడ్ మాటున అక్రమంగా తరలిస్తున్న 1480 లిక్కర్ క్వార్టర్ బాటిల్స్ ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బొలెరో ట్రక్ ను సీజ్ చేసి & ముగ్గురు వ్యక్తులను పిడుగురాళ్ళ పోలీసులు అరెస్ట్  చేసారు.

Here's Guntur Police Tweet 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చిన సంగతి విదితమే. గతంలో మాదిరే ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి 3 మద్యం సీసాలను తీసుకురావొచ్చని (AP High Court Judgement on Liquor Transport) స్పష్టం చేసింది. ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా.. పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మద్యం సీజ్‌ చేస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు (three liquor bottles) తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది