Amaravati, Sep 2: మద్యం నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన వేళ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.గతంలో మాదిరే ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి 3 మద్యం సీసాలను తీసుకురావొచ్చని (AP High Court Judgement on Liquor Transport) స్పష్టం చేసింది. ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా.. పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు మద్యం సీజ్ చేస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు (three liquor bottles) తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం
జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఈ తీర్పును ఇచ్చింది. ప్రతి అడుగులోనూ నాన్నే నాకు తోడు అంటూ సీఎం జగన్ ట్వీట్
ఇప్పటికే సంపూర్ణ మద్యపానం నిషేదాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (Special Enforcement Bureau) పేరుతో కొత్త శాఖను సృష్టించింది ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వుల కూడా జారీ చేశారు. ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే
పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం, రాష్ట్రం లోపన అక్రమ మద్యం తయారీని అణచివేయడం, మద్యం తయారీదారులపై ఉక్కుపాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించింది. ఈ కొత్త శాఖలో ఆరువేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. మంజూరైన పోస్టులు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు.. ఇలా మొత్తం 6274 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఈ శాఖకు కేటాయించారు.