Yeduguri Sandinti Rajasekhara Reddy (Photo-Twitter)

Amaravati,Sep 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని (#YSRVardhanthi) పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద (YSR Ghat Idupulapaya Kadapa) కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

తన ప్రతి అడుగులోనూ నాన్నే తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వైఎస్సార్‌ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నార’’ని పేర్కొన్నారు.

Here's YSR Son  AP CM YS JaganTweet

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వర్గీయులై 11 ఏళ్లు (YSR Death Anniversary) పూర్తయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోవటానికి కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలేనని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే మహానేత వైఎస్సార్‌కు (Y. S. Rajasekhara Reddy) ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

 AP CM YS Jagan Paying Tributes to YS Rajasekara Reddy at YSR Ghat

ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (Yeduguri Sandinti Rajasekhara Reddy) చిరస్థాయిగా ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి వైఎస్సార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విశాఖ, అరకు ఎంపీలు ఎంవీవీ, మాధవిలు కొనియాడారు. ప్రతి పేద గుండెలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. దేశంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్సుమెంట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయనేనని అన్నారు. గిరిజనులందరికీ పట్టాలు పంచిన ఏకైక వ్యక్తి వైఎస్సారేనని తెలిపారు.

YSR's Praja Prasthanam

#వైయస్సార్.. ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది.నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది.అలాంటి మహానేత చేసిన పాదయాత్ర (YSR's Praja Prasthanam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలి పాదయాత్రగా లిఖించబడిన ఓ ప్రస్థానం. 53 ఏళ్ల వయసులో దాదాపు 1470 కి.మీ సాగిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచింది.

క్లుప్తంగా చెప్పాలంటే..ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న ఓ పార్టీకి చెక్ పెట్టిన పాదయాత్ర అది. నాయకుడు ఉండాల్సింది రాజధానుల్లో కాదు, ఏసీ గదుల్లో కాదు.. ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలు పడుతున్న దీనావస్థలని చూడాలంటూ 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర ఇఛ్ఛాపురం దాకా మండుటెండలో సాగింది. తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి

ప్రతి పల్లెను, రైతన్నను పలకరిస్తూ సాగిన ఈ పాదయాత్ర కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతులకు, ఆసరా కరువై కన్నీరు పెడుతున్న పల్లెలకు నేనున్నానంటూ భరోసానిచ్చింది. 3నెలల పాటు నిర్విరామంగా అనితర సాధ్యమైన రీతిలో ప్రాణాలు పణంగాపెట్టి పెద్దాయన చేసిన ఆ పాదయాత్రతో కన్నీరు సైతం ఆవిరైపోయి, ఎండిన డొక్కలతో బిక్కుబిక్కుమంటున్న ప్రతి గుండెకి నేనున్నానంటూ ధైర్యాన్ని,భరోసాని ఇచ్చింది.

ఈ పాదయాత్రకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిక్కూమొక్కు లేక కుక్కలు చింపిన విస్తరిలా ఉంది. తానొక్కడే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ పార్టీకి పాదయాత్రతో పూర్వవైభవం తీసుకొచ్చారు. మండుటెండల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయాల్లో వైయస్సార్ చేసిన పాదయాత్ర.. దిక్కులేక అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరినిచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చేసింది.

ఈ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. పాదయాత్ర రాజమండ్రికి చేరుకున్నప్పుడు వైయస్‌ఆర్‌ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా.. ఆనాటి సోనియాగాంధీ ఒరిస్సా పర్యటనకు వెళ్తూ విశాఖ ఎయిర్‌పోర్టులో దిగితే.. రోశయ్య వైయస్‌ఆర్‌ ఆరోగ్య పరిస్థితి వివరించి పరామర్శకు రమ్మని కోరినా.. ఎవరిని అడిగి పాదయాత్ర చేస్తున్నాడని కర్కశంగా మాట్లాడారు. ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్

ఈ పాదయాత్రకు ఆటంకం కలిగించడానికి సొంత పార్టీ నాయకులే అడ్డంకులు సృష్టించారు. అయినా అదరక బెదరక ప్రజల మధ్యనే సాగుతూ, గుడిసె గడిసెను పలకరిస్తూ.. గుండెల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ప్రతి ఒక్క హృదయాన్ని తడుముతూ ముందుకు సాగారు వైయస్సార్. ఇలాంటి నాయకుడు మాకు కావాలనే నమ్మకం ప్రజలకు కలిగేలా చేశారు. వైయస్‌ఆర్‌ తప్ప మా కష్టాలు ఎవరూ తీర్చలేరు అనే భరోసాను కల్పించారు. నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌, ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

ఈ పాదయాత్రలో వైయస్ ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు చేయలేదు. కానీ సామాన్యుల గుండెను తట్టారు. జనం దేనిని కోరుకుంటున్నారో గుర్తించారు. త్రాగునీరు, సాగునీరు, వైద్య సదుపాయాలు లేని గ్రామీణ ప్రజల దుర్భర పరిస్థితిని గమనించారు. సమస్యలు తెలుసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు అభయం ఇచ్చారు. ఆ నమ్మకంతోనే ప్రజలు వైయస్ కి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు.

పాదయాత్ర సమయంలో ప్రజల కన్నీళ్లు తుడుస్తూ నమ్మకం కలిగించిన వైయస్‌ఆర్‌ ఏనాడు ఇచ్చిన మాట తప్పలేదు.

ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో వాటన్నింటినీ నేరవేర్చారు. అనేక పథకాలతో పేదవాడి గడప గడపను ముద్దాడారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీరీయింబర్స్‌మెంట్, మహిళలకు పావల వడ్డీ ఋణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్,జలయజ్ఙం తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వై.ఎస్. నిలిచిపోయారు.

ఇక 2009 ఎన్నికలకు ముందు అన్ని ప్రతి పక్షాలు ఒకవైపు, మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం ఇవి ఏవీ రాజశేఖర్ రెడ్డి ప్రాభవాన్ని అడ్డుకోలేక పోయాయి. మళ్ళీ 2009 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పాదయాత్ర కన్నా ముందే 1980లో రాయలసీమ కరువు ప్రాంతాలైన అనంతపురం జిల్లా లేపాక్షి నుండి కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు వైయస్సార్ పాదయాత్ర చేశారు. అప్పుడు రాయలసీమ శాసన సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేయించారు కూడా. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిపై ఎన్ని అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నప్పటికీ తాను చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.