HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Dec 15: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని (theatre owners to submit ticket prices) ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 35ను మొన్న‌ హైకోర్టు సింగిల్ జ‌డ్జి బెంచ్‌ కొట్టివేసిన విష‌యం తెలిసిందే.. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలో టికెట్‌ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు/ పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చారు. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును స‌వాలు చేస్తూ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై డిజివిన్ బెంచ్‌లో ఏపీ ప్ర‌భుత్వం అప్పీల్ చేయ‌డంతో ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. ప్రభుత్వం త‌ర‌ఫున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తమ వాదనలను వినిపించారు.

సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. థియేటర్‌ యాజమాన్యాలు ఎక్కువ ధరలకు టికెట్‌ ధరలను నిర్ణయించుకునే అవకాశముందని.. దీనివల్ల సామాన్యుడిపై భారం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలను ధర్మాసనం ముందు వినిపించారు. దీనిపై స్పందించిన డివిజన్‌ బెంచ్‌.. టికెట్‌ ధరల ప్రతిపాదనలను థియేటర్‌ యాజమాన్యాలు జేసీ (Joint Collectors) ముందు ఉంచాలని ఆదేశించింది. ధరలపై జేసీయే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా టికెట్‌ ధరలపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.