AP Capital Move Row: అమరావతి కేసులు నేటి నుంచి హైకోర్టులో విచారణ, 90కి పైగా పిటిషన్లను విచారించనున్న హైకోర్టు ఛీప్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Nov 15: అమరావతి కేసులను ఏపీ హైకోర్టు నేటి నుంచి దశలు వారీగా విచారించనుంది. సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ, రాజధాని తరలింపులపై (AP Capital Move Row) అమరావతి రైతులు, ఇతర నేతలు 90కి పైగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Chief Justice Prashant Kumar Mishra) ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ వ్యాజ్యాలపై నేటి నుంచి రోజువారీ విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ కేసులను హైబ్రిడ్ పద్ధతుల్లో హైకోర్టు (Andhra Pradesh high court) విచారించనుంది.

గత ఏడాది జనవరిలో ఈ పిటిషన్ల విచారణ కోసం జస్టిస్ మహేశ్వరి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అయితే జస్టిస్ జేకే మహేశ్వరి (Chief Justice J K Maheswari) బదిలీ కావడంతో విచారణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో సీజేగా అరూప్ గోస్వామి రావడంతో ఈ కేసులు ఆయన ముందుకు వచ్చాయి. త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.

పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులదే హవా, 27 సర్పంచ్‌, 47 వార్డు స్థానాలు కైవసం, పెండింగ్ పంచాయితీ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

ఈ ఏడాది ఆగస్టు 13న ఈ పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. దీంతో అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ జరగనుంది. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. రైతుల తరపు వాదనలు ముగిసిన తర్వాత, ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. మరోవైపు అమరావతి రైతుల దీక్ష 697వ రోజుకు చేరుకుంది. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో వారు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది.