
Vjy, Feb 14: మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో సంచలనం రేపిన సంగతి విదిమే. తాజాగా ఈ కేసులో మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ (CI Ragiri Ramaiah Suspended) చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీఐపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు
ఘటన వివరాల్లోకెళితే.. బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమె వీడియో ద్వారా తనకు జరిగిన అవమానాన్ని ( harassing woman in Madakasira ) వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.
టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం వారికి సర్ది చెప్పాలని ఆమె పోలీస్ స్టేషన్‌కు వారిని తీసుకువెళ్లింది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వెళ్లి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు తెలిపింది. అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్‌లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది.
‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్‌ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని దీంతో ఇంటికి పంపించారని చెప్పింది.
రాత్రి స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు
ఏపీలో మరో దారుణం.
నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు.
మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగోలికి వచ్చింది.
కేసుతో నాకు సంబంధం లేకపోయిన 5 నిమిషాలకు ఒకసారి పిలిచి నా పర్సనల్ విషయాలు అడిగి లైంగికంగా వేధించారు -… pic.twitter.com/x4OUt8if5l
— greatandhra (@greatandhranews) February 10, 2025
విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.