
నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడిపూడి పెంచల ప్రసాద్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఎదుటే భర్తను హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
యువకుడి శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.