APRTC Bus Overturned in Paleru River: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగడంతో ఓ బస్సు వరదకు కొట్టుకుపోయింది. నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సు వరదకు కొట్టుకుపోయి.. పక్కనున్న పొలంలోకి దిగడంతో డ్రైవర్ అతికష్టం మీద ఆపి.. ప్రయాణికులు ఒడ్డుకు చేరేలా చేశారు. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు
పూర్తి వివరాల్లోకెళితే.. కోవెలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం తెల్లవారు జామున 5 గంటలకు వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలంలోని కొండసుంకేసుల గ్రామం నుంచి కోవెలకుంట్లకు బయల్దేరింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి సంజామల సమీపంలో పాలేరు వాగు పొంగుతోంది. ప్రవాహాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చారు. వంతెన మీద కొద్దిదూరం వెళ్లగానే ప్రవాహానికి బస్సు నెమ్మదిగా కొట్టుకుపోసాగింది.
Here's Videos
నంద్యాల: వాగులో చిక్కుకుపోయిన బస్సు..
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు..!! నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో… pic.twitter.com/cANPc6r7xD
— ChotaNews (@ChotaNewsTelugu) June 6, 2024
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం :
సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు..!!
తప్పిన పెనుముప్పు..!!
పాలేరు వాగు వంతెన పై వర్షపు నీరు..
నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన… pic.twitter.com/FAWwv9PlEr
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) June 6, 2024
బస్సు కుడివైపు చక్రాలు వంతెన దిగి పొలంలో దిగబడ్డాయి. డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేసి అందులోని ప్రయాణికులు దిగిపోవాలని సూచించారు. 13 మంది ప్రయాణికులు ఒకరినొకరు పట్టుకొని బస్సు దిగి స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరారు. అందరూ ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.