Amaravati, August 18: ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 68, 041 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1, 443 మందికి పాజిటివ్ (Corona in Andhra Pradesh) వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,94,207కు (Covid in Andhra Pradesh) చేరింది. మరోవైపు 1,815 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,64,577 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. తూర్పుగోదావరిలో ఒకరు, శ్రీకాకుళం, విశాఖలో ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 13,686కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2, 58, 35, 650 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
కెనడాకు చెందిన ఓ హెల్త్ ఏజెన్సీ జరిపిన సర్వే ప్రకారం 14 నుంచి 17 ఏళ్ల పిల్లలకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని, జీరో నుంచి మూడేళ్ళ వయసు ఉన్న పిల్లలకు ఈ ప్రమాదం తక్కువని సర్వే చెప్పింది. అయితే పసివాళ్లకు ఒకసారి సోకిందంటే మాత్రం ప్రమాదకరమని తెలిపింది. పసివాళ్ల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం 43 శాతం ఎక్కువగా ఉన్నట్లు చెబుతోంది. అయితే ఇదేం కొత్త విషయం కాదని నిపుణులు అంటున్నారు.
దేశంలో తాజాగా 35,178 కోవిడ్ కేసులు, ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్ కేసులు
పసివాళ్లకు వైరస్ సోకితే వారిని ఐసోలేట్ చేసే అవకాశం ఉండదని, వారి సంవరక్షకులు, తోబుట్టువులకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 14 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు కోవిడ్ బయట సోకవచ్చునని, అప్పుడే పుట్టిన పిల్లలు.. మూడేళ్ల లోపువారికి ఈ ప్రమాదం తక్కువని సర్వేలో తేలింది.