Coronavirus Cases in TS (Photo Credits: PTI)

Amaravati, May 8: ఏపీలో కరోనా గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి పాజిటివ్ (AP Covid Report) అని వెల్లడైంది. విశాఖ జిల్లాలో 2,525 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 2,370 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు గుర్తించారు. ఒక్క విజయనగరం (650) మినహా అన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 19,272 మంది కరోనా నుంచి కోలుకోగా, 96 మంది మృత్యువాత (Coronavirus Deaths) పడ్డారు.

అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విశాఖ జిల్లాలో 12 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 12,65,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 10,69,432 మంది కోలుకున్నారు. ఇంకా 1,87,392 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8,615కి (Covid Deaths) చేరింది.

పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు, నిన్న కొత్తగా నాలుగు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 4,187 మంది కరోనా కారణంగా మృతి

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లభించేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. బెడ్లు, రెమిడెసివిర్‌పై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు 15,747 రెమిడెసివిర్‌ వయల్స్‌ ను పంపిణీ చేశామన్నారు.

Here's AP Covid Report

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత దృష్ట్యా సెకండ్‌ డోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ లభ్యత వచ్చిన వెంటనే అందరికీ టీకాలు వేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రులపై అధికారుల నిఘా కొనసాగుతోందని తెలిపారు.