Amaravati, May 18: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 21,320 కరోనా కేసులు (new Covid-19 cases) నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి (Covid Deaths) చెందారు. ఇప్పటివరకు కరోనాతో 9,580 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 14,75,372కి కరోనా కేసులు (AP Covid Cases) చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 21,274 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నుంచి కోలుకుని 12,54,291 మంది రికవరీ అయ్యారు. ఇక కొత్తగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పది మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. అంతేకాకుండా అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున, నెల్లూరు ఐదుగురు, కడప ఇద్దరు కరోనాతో మృతి చెందారు.
ఏపీలో జూలై 15 నాటికి రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు ఈమెయిల్ ద్వారా పంపారు.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 18th May 2021 10:00 AM
COVID Positives: 14,72,477
Discharged: 12,51,396
Deceased: 9,580
Active Cases: 2,11,501#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0q3bPLUDjW
— ArogyaAndhra (@ArogyaAndhra) May 18, 2021
ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్‌ఐఆర్ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్)సాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటాను తయారు చేశారు. కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటాను ఎస్‌ఎస్‌ఐఆర్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి విశ్లేషణ చేశారు.
ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్ 14 నాటికి 1,000 జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని, జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌ఆర్‌ఎం గణాంకాలు తెలియజేస్తున్నాయి.