Amaravati, July 18: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 1,05,024 మంది నమూనాలు పరీక్షించగా 2,974 కొత్త కేసులు (Corona in Andhra Pradesh) నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 యాక్టివ్ కేసులు (Active Cases) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13, 132కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 2,35,93,065 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తాడికొండ మండలంలోని ఐదు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు.
తాడికొండ, దామరపల్లి, లామ్, పొన్నెకల్లు, బండారుపల్లి గ్రామాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తహాశీల్దార్ కుటుంబ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.