Amaravati, June 8: ఏపీలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవలి వరకు నిత్యం 100కి పైగా నమోదైన మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. ఇప్పుడు కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77 మంది చనిపోయారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది,అనంతపూర్ లో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో అయిదుగురు, గుంటూరు, ప్రకాశంలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, కడపలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు మరణించారు. ఇప్పటిదాకా ఏపీలో కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 11,629కి చేరింది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా... 7,796 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 17,71,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,51,790 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,07,588 మందికి చికిత్స కొనసాగుతోంది.
Here's Andhra Pradesh Report
#COVIDUpdates: As on 08th June 2021 10:00 AM
COVID Positives: 17,68,112
Discharged: 16,48,895
Deceased: 11,629
Active Cases: 1,07,588#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DQIRgIh8cJ
— ArogyaAndhra (@ArogyaAndhra) June 8, 2021
గత 24 గంటల్లో అనంతపురంలో 918 కేసులు, చిత్తూరులో 1210, ఈస్ట్ గోదావరిలో1302, గుంటూరులో 518, కడపలో 410, కృష్ణాలో 379, కర్నూలులో147, నెల్లూరులో 311, ప్రకాశంలో 499, శ్రీకాకుళంలొ 376, విశాఖపట్నంలో 672, విజయనగరంలో 299, వెస్ట్ గోదావరిలో 755 కేసులు నమోదయ్యాయి.