COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, June 6: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్‌గా కేసులు (Coronavirus in AP) నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90 మంది (Covid Deaths) మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారి నుంచి 13,568 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా.. 16 లక్షల 23 వేల 447 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,97,91,721 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ కరోనాపై ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

కొత్తగా చిత్తూరు జిల్లాలో 12 మంది కరోనాతో మృతి చెందారు. పశ్చిమగోదావరిలో 9 మంది మృతి చెందారు, అనంతపురం 8 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళంలో 8 మంది, విజయనగరంలో 8 మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, కర్నూల్ జిల్లాలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, విశాఖపట్నం ఐదుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. ఇక కడప జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు.

కృష్ణపట్నం కరోనా మందు పేరు ఇకపై ఔషధ చక్రం, ఈ పేరునే పరిగణించాలని కోరిన ఆనందయ్య, రేపటి నుంచి జిల్లాలకు 3 రకాల మందు కిట్లు, సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీకి భూమి పూజ చేసిన ఆనందయ్య

పశ్చిమగోదావరి జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఐసీయూ, నాన్‌ ఐసీయూ బెడ్స్‌ ఆధారంగా ఆక్సిజన్‌ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడుకోవాలని సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.