Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

SPSR Nellore, July 6: నెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో బావను బీర్‌ బాటిల్‌తో పొడిచి బావమరిది దారుణంగా హత్య చేసిన ఘటన (Man kills brother-in-law in Nellore ) చోటు చేసుకుంది. సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటిక వద్ద ఈ హత్యా ఘటన జరిగింది. నెల్లూరు పోలీసుల (Nellore Police) సమాచారం మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన సునీల్‌, రాజా బావా బామర్దులు, సునీల్ తన చెల్లెలను రాజాకు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరు ఇద్దరూ నెల్లూరులో కాపురం పెట్టాడు.

అయితే రాజా చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె భర్తపై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శైలజ తన అన్న సునీల్‌ వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని రాజా కొద్ది రోజులుగా బావ సునీల్‌పై ఒత్తిడి తెస్తున్నాడు. చెడు వ్యసనాలు మాని మంచిగా ఉంటానంటే శైలజను కాపురానికి పంపుతానని సునీల్‌ వాయిదా వేస్తూ వచ్చాడు.

అయితే సునీల్ ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సునీల్ కు మౌనికతో పెళ్లి అయింది.పెళ్లి అయినప్పటి నుంచి మౌనిక సోదరుడు పవన్‌ బావ సునీల్ ఇంట్లోనే ఉంటూ బావతో పాటు పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో భార్యను కాపురానికి పంపాలని ఒత్తిడి చేస్తున్న రాజా పవన్ ను కలిసి ఎలాగైనా బావను ఒప్పించి తన భార్యను కాపురానికి పంపేందుకు సహాయం చేయాలని కోరారు.

అసలేం జరిగింది..ఐస్ క్రీం తిని అత్త మృతి, తరువాత రోజు అల్లుడు హోటల్‌లో మృతి, మిస్టరీగా మారిన అత్త రోసీ సంగ్మా, అల్లుడు శామ్యూల్ సంగ్మా మరణాలు, కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ, గురుగ్రామ్‌ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో జరుగుతున్న గొడవలను మాట్లాడి పరిష్కరించుకుందామని పవన్‌ తన బావ సునీల్‌ను సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇంతలో రాజా మద్యం తీసుకుని వారున్న చోటుకు వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం తాగుతున్న క్రమంలో శైలజను భర్తతో పంపాలని పవన్‌ తన బావపై ఒత్తిడి తెచ్చాడు. వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన పవన్‌ తాను తాగుతున్న బీర్‌ బాటిల్‌ను పగులగొట్టి క్షణికావేశంలో బావ సునీల్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు.

గాయపడిన సునీల్‌ను స్థానికులు చికిత్స నిమి త్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సైలు హాస్పిటల్‌ వద్ద కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పవన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.