Andhra Pradesh: వీడు మాములోడు కాదు.. ఏకంగా ఆర్టీసీ బస్సుతో పరారయిన దొంగ, విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన, ఎట్టకేలకు అధికారులకు చిక్కిన బస్సు
APSRTC Bus. (Photo Credits: PTI | Representative Image)

Vizianagaram, August 10: విజయనగరం జిల్లాలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు.జిల్లాలోని వంగరలో (Vangara Bus Theft) ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వంగరకు ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన ఓ నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు రాగా, ఆ బస్సు ఉదయానికి మాయం (APSRTC Bus ) అయింది. వెంటనే డ్రైవర్ పీల బుజ్జి పోలీసులకు, ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో బస్సులో ఉన్న జీపీఎస్ వ్యవస్థ పని చేయకపోవడంపై పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే బస్సు ఆచూకీ కనిపెడుతున్న సమయంలో అనూహ్యంగా బస్సు ఎక్కడుందో అధికారులకు ఆధారం దొరికింది.ఈ పల్లె వెలుగు బస్సును (Palle Velugu Bus Theft) దొంగిలించిన దొంగ రేగిడి మండలం మీసాల డోలపేట కందిశ గ్రామాల మధ్యలో బస్ ను నిలిపివేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్రేమించకపోతే ఇలా కక్ష తీర్చుకుంటారా.. యువతి లవ్ చేయడం లేదనే కోపంతో ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, నల్గొండ జిల్లాలో దారుణం

రేగిడి ఆమదాలవలస మండలం (Amadala Valasa Mandal) మీసాల డోలపేట దగ్గర గుర్తించామని ఆర్టీసీ డీఎం వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే, బస్సును దొంగిలించిన ఆగంతకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, అందుకోసం సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.