Fire (Representational image) Photo Credits: Flickr)

Visakhapatnam, July 14: విశాఖపట్నంను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత ఘటనలు మరచిపోకముందే వైజాగ్ పరవాడ ఫార్మా సిటీలో (Parawada Pharma City) సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో (Ramky CETP Solvent’s building) సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో (Vizag Pharma City Tragedy) ఒక కార్మికుడు చనిపోయారు. మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు. విశాఖపట్నం ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి, నలుగురికి అస్వస్థత, ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య, ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు, వదంతులు నమ్మవద్దన్న విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా

అగ్నిమాపక శాఖకు చెందిన 5 ఫైర్‌ ఇంజన్లు, రాంకీ కంపెనీకి చెందిన మూడు ఫైరింజన్లు రెండున్నర గంటల్లో మంటలను అదుపు చేశాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి.

Another industrial accident in Vizag

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. పరవాడ ఫార్మా కంపెనీ లో ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక అనంతరం ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు. వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం

విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులని ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు ఏర్పడ్డాయని, ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. వరుస ప్రమాదాల‌ నేపధ్యంలో మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.