Amaravati, Jnune 22: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని హుటాహుటిన మొహాలీలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే (condition stable) ఉందని, ఆందోళన చెందాల్సి పనిలేదని (Vallabhaneni Vamsi Health Update) ఎమ్మెల్యేకు చికిత్స అందజేస్తున్న వైద్యులు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అమెరికాలో తెలుగు బిడ్డ దారుణ హత్య, నల్గొండ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తుఫాకీతో కాల్చివేసిన నల్లజాతీయుడు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన యుఎస్ అధికారులు

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన వంశీ అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలసీ కోర్సు చేస్తున్నారు. పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. నిన్న క్లాస్‌కు వెళ్లిన ఆయనకు ఎడచేయి లాగినట్లు అనిపిస్తుండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు 2డీ ఏకో, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు.