Kuppam, Nov 17: టీడీపీ అధినేత చంద్రబాబు కంచు కోట కుప్పంలో (Kuppam Municipality) ఆయనకు బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ (Andhra Pradesh Municipal Election Results 2021) అదే బాటలో పయనిస్తోంది. 25 వార్డుల్లో ఇప్పటికి వెలువడిన ఫలితాల ప్రకారం 17 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీ రెండు స్థానాల్లో గెలిచింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.
నెల్లూరుజిల్లాలో వైసీపీ తన విజయాన్ని కొనసాగిస్తోంది. బుచ్చి నగర పంచాయితీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇప్పటికే గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, కడపజిల్లా కమలాపురం, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, అనంతపురం జిల్లా పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లా బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
రౌండ్ వార్డుల వారీగా ఫలితాలు..
►కుప్పం ఒకటో వార్డులో జగదీష్ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►రెండో వార్డులో మునిరాజు (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►మూడో వార్డులో మురుగప్ప (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►నాలుగో వార్డులో రాజమ్మ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►ఆరో వార్డులో జయంతి (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►ఏడో వార్డులో 300 ఓట్ల మెజార్టీతో నాగరాజు (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►ఎనిమిదో వార్డులో 314 ఓట్ల మెజార్టీతో చంద్రమ్మ (వైఎస్సార్‌సీపీ) విజయం
►తొమ్మిదో వార్డులో 77 ఓట్ల మెజార్టీతో హఫీజ్ (వైఎస్సార్‌సీపీ) విజయం
►పదో వార్డులో 276 ఓట్లతో మమత (వైఎస్సార్‌సీపీ) విజయం
►12వ వార్డులో 188 ఓట్ల మెజార్టీతో మాధవి (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►13వ వార్డులో 115 ఓట్ల మెజార్టీతో హంస (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►14వ వార్డులో మునిస్వామి (వైఎస్సార్‌సీపీ) విజయం
►15వ వార్డులో తిలగావతి (వైఎస్సార్‌సీపీ) గెలుప
కుప్పంలో అత్యధిక స్థానాలను గెలవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ కుప్పంకోట బద్దలైందన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిందన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఎన్నో ఏళ్లుగా గెలిపిస్తున్న ఆయన సొంత నియోజవకర్గంలోని ప్రజలే బాబును నమ్మలేదని ఈ ఫలితాలతో అర్థమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.