Visakhapatnam, May 23: విశాఖలోని మధురవాడలో నవ వధువు సృజన మృతిపై (Bride Srujana Death Case) ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు.
దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడిని గత ఏడేండ్ల నుంచి సృజన(love affair suspected) ప్రేమిస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలని సృజన తన ప్రియుడిని కోరగా, జీవితంలో సెటిలైన తర్వాత చేసుకుంటానని నమ్మబలికాడు. ఇంకో రెండేండ్లు ఆగాలని చెప్పారు. పెళ్లికి రెండు రోజుల ముందు సృజన తన ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తీసుకెళ్లాలని సృజన మోహన్‌ను కోరింది. రెండేండ్లు సమయం కావాలని సృజనకు మోహన్ చెప్పాడు. ఎలాగైనా పెళ్లిని ఆపేందుకు ట్రై చేస్తానని చెప్పింది. అనంతరం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లతో పాటు కాల్ డేటాను సృజన డిలీట్ చేసింది. పెళ్లిని ఆపేందుకు సిద్ధపడిన సృజన.. ఈ నెల 11వ తేదీన విష పదార్థం తీసుకున్నది. అనంతరం ముహూర్తం సమయానికి పెళ్లి పీటల పైనే ఆమె కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న సృజన మృతి (Visakhapatnam bride Srujana death ) చెందింది.