
VJY, Nov 3: ఏపీలోని విజయవాడ నగరంలోని స్పా, మసాజ్, ఫిట్నెస్ సెంటర్‌లతో పాటు పలు హోటళ్లపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 131 స్పా, మసాజ్ సెంటర్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు (Police raid Vijayawada spas and massage centres) చేశారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడు కేంద్రాలను సీజ్ చేసి 23 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా కొనసాగుతున్న 93 మసాజ్ సెంటర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ అధికారులకు లేఖలు రాశారు.