Amaravati, Dec 31: ఏపీ ప్రభుత్వం మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల (Popular premium brands) మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. అందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ (Andhra Pradesh State Beverages Corporation Limited (APSBCL)) కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ (govt-run wine stores) ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి నిచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక న్యూఇయర్ సెలెబ్రేషన్లకు అందరూ సిద్ధమవుతున్న తరుణంలో మందుబాబులకు ఏపీప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.