
Amalapuram, May 24: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు (protests against ap govt's decision) హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడిచేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందన్నారు. కోనసీమ జిల్లాకు ప్రజల అభీష్టం మేరకు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం (konaseema district name change ) సరికాదని, కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ పేరు పెట్టామని అన్నారు. కాగా కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్ కాలేజ్ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.