TDP Mahanadu: అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు, రాష్ట్రంలో ఉన్మాది పాలన, చేతకాని దద్దమ్మ జగన్, మహానాడు వేదికగా సీఎంపై విరుచుకుపడిన చంద్రబాబు
TDP Mahanadu (Photo-Twitter)

Ongole, May 27: మహానాడు(Mahanadu) తెలుగుజాతికి పండుగ అని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్(Jagan) వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు. గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు.

నేడు ఒంగోలు(Ongole)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటే ప్రజలు నమ్మారన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ(MLC) అనంతబాబు హత్య చేశాడన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ(Konaseema) అల్లర్లు తీసుకొచ్చారన్నారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోయారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడుకుండా ఎందుకు ఆపలేదు? మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారు. రాజ్యసభ(Rajyasabha) సీట్లలో ముగ్గురు మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారు.

రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర, పాత గాజువాక వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభం, 17 మంది మంత్రులతో సామాజిక న్యాయభేరి

సహ నిందితులకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. పోలవరం ఏమైంది..? విభజన హామీల అమలు ఏమయ్యాయి? గెలిచిన తర్వాత కేంద్రం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. జగన్‌(Jagan) దిగిపోతే తప్ప మంచి రోజులు రావు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగింది. క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ నినాదం (Quit Jagan and save AP) ప్రతి ఇంట్లో వినిపించాలని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. వైసీపీ(YCP) తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రోడ్డు మీదకు రండి... మీకు అండగా మేము ఉంటాం. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే మన పోరాటం. పెట్రోల్‌ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదు.

ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్‌ అన్నీ పెంచేశారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రోడ్లపైకి రండి. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? రాష్ట్రంలో నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారు?‘‘ అని తెలిపారు.