Andhra Pradesh Floods: గంగమ్మ ఉగ్రరూపం, వణుకుతున్న మూడు జిల్లాలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే
Andhra Pradesh Floods 2021 (Photo-Twitter)

Amaravati, Nov 20: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే (CM YS Jagan Aerial Survey) నిర్వహించడానికి గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్‌ జగన్, అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. ఏపీలోని వరద పరిస్థితులపై సీఎం జగన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా (Flood Hit Region) పలుచోట్ల ప్రాణనష్టం సంభవించింది. భవనాలు కూలిపోయాయి. పంట మొత్తం నాశనమయింది.

భారీవర్షాలతో (Andhra Pradesh Floods) పోటెత్తిన వరద వైఎస్సార్, చిత్తూరు జిల్లాలను ముంచెత్తింది. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. తిరుమలలో వరద భయం కలిగిం చింది. తిరుపతి విలవిల్లాడింది. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయు గుండం నేపథ్యంలో కురిసిన వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి.540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 23 మంది గల్లంతయ్యారు. వీరిలో 9 మంది మృతదేహాలు లభించాయి.

వైఎస్సార్‌ జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ఊళ్లను ముంచేసింది. నాలుగు బస్సులు నీళ్లల్లో చిక్కుకున్నాయి. ఒక బస్సులో కండక్టరు, ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. పెద్దసంఖ్యలో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి. ఏపీ సీఎం ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు.

వీడియో, చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సేఫ్, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కాపాడిన ఇండియన్ నేవీ సిబ్బంది

పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోవడంతో చెయ్యేరు నది లక్షల క్యూసెక్కుల వరదతో వరదతో పరవళ్లు తొక్కింది. వరదకు పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ తెగిపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో అన్నమయ్య ప్రాజెక్టులోకి ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి పడింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కొట్టుకుపోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరదనీరు అతి వేగంగా దూసుకువస్తూ గ్రామాలపైకి వచ్చేసింది. ఆ గ్రామాల్లో ప్రజలు తేరుకుంటుండగానే ఇళ్లను ముంచెత్తింది.

ఈ వరద ప్రవాహంలో 18 మంది గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిదిమంది మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. మందపల్లె గ్రామంలో శివాలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఊళ్లోకి వరద వస్తున్నట్లు తెలియడంతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు ట్రాక్టర్‌లో శివాలయంలోకి వెళ్లారు. వరద శివాలయాన్ని ముంచెత్తింది. పురోహితులైన అన్నదమ్ముల కుటుంబాల్లో తొమ్మిదిమంది గల్లంతయ్యారు.

బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు, వరద సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

వీరిలో కాంతమ్మ మృతదేహం లభించింది. రాజంపేట–నందలూరు మార్గంలో రామాపురం చెక్‌పోస్టు సమీపంలో 4 బస్సులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. వీటిలో రెండు ఆర్టీసీ బస్సులు, ఒక అద్దె బస్సు, ఒక ప్రైవేట్‌ బస్సు ఉన్నాయి. అద్దె బస్సు నీటి ఉధృతికి కల్వర్టులోకి కొట్టుకుపోయి కండక్టర్‌ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనివాసులు, లక్కిరెడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ మృతి చెందారు. మిగిలిన 3 బస్సుల డ్రైవర్లు, ప్రయాణికులు 27 మంది బస్సుల పైకి ఎక్కారు. వారిని రెస్క్యూ బృందం రక్షించింది.

క‌డ‌ప జిల్లాలోని మైల‌వ‌రం డ్యామ్‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో పెన్నాన‌దికి 1.5 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా రోడ్డు, రైలు మార్గాలు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. దీంతో ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌లిగింది. క‌డ‌ప – తిరుప‌తి మ‌ధ్య ర‌వాణా కార్య‌కలాపాలు ఆగిపోయాయి. అనంత‌పురం జిల్లా గౌరిబిదనూరు దగ్గర ఉన్న చెరువు రాత్రి తెగిపోవడంతో పెన్నానదికి నీటిప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కావున పెన్నానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎవరిని నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో వెళ్లకుండా చూసుకోవలసినదిగా హిందూపురం తాసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలోని కడప జిల్లాలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రాజంపేటలో భారీ ప్రాణనష్టం సంభవించింది. దాదాపు 30 మందికి పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. నందలూరు పరీవాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్సులోని కండక్టర్‌, ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు.

వరద ఉధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోయి పరీవాహక ప్రాంతాలైన గుం డ్లూరు, శేషామాంబాపురం, మండపల్లి గ్రామాలు నీట మునిగాయి. చెయ్యేరు నది పోటెత్తి ఎనిమిది గ్రా మాలు నీటమునిగాయి. అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. చెన్నేకొత్తపల్లి మం డలం వెల్దుర్తి వద్ద నదిలో కారు చిక్కుకున్నది. అందులోని నలుగురిని రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. విశాఖ, బెంగళూరు నుంచి రెండు హె లికాప్టర్లలో వచ్చిన రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లానూ వ ర్షం ముంచెత్తింది. వెలిగల్లు, అన్నమ య్య, పింఛా, బుగ్గవంక, మైలవరం ప్రాజెక్టుల నుంచి వరదనీటిని వదల డంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

తిరుమల కొండల్లోంచి వచ్చిన నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది.

తిరుమలలోని గోగర్భం డ్యాం, పాపనాశనం డ్యాం నిండిపోయాయి. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఆ నీటితో పాటు... కొండల్లో నుంచి దుమికే వరద నీరు తిరుపతి కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కపి లేశ్వరస్వామి ఆలయం వరద నీటితో నిండి పోయింది. ఆ వరద నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. మాల్వాడీగుండం కాలువ పొంగి ప్రవహించింది. ఫలితంగా తిరుపతి నగరంలోని సుమారు 70 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకు న్నాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తేయడంతో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది.

చంద్రగిరి–శ్రీకాళహస్తి మధ్యలో స్వర్ణముఖి నదిపై ఏడు వంతెనలు కొట్టుకుపోయాయి. కేవీపల్లి వద్ద పింఛా నది కట్ట తెగిపోయింది. కౌండిన్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బహుదానది ప్రవాహంతో కాణిపాకం ఆలయం జలమయమైంది. జిల్లాలో 540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు, కర్ణాటకకు కొన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బంగారుపాళెం వద్ద నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

కొండచరియలు విరిగిపడటం, పొగమంచు కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్లను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి మూసివేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోడ్లను పునఃప్రారంభించే సమయాన్ని తరువాత ప్రకటించనున్నట్లు తెలిపింది. విరిగిపడ్డ చరియలను తొలగించి శుక్రవారం రాకపోకలకు అనుమతి ఇచ్చారు. శ్రీవారి దర్శనాలకు అనుమతులు ఉండి వర్షం కారణంగా రాలేని భక్తులకు మరోసారి అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈఓ ప్రకటించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సమీపంలో పెన్నానదిలో చిక్కుకున్న 17 మంది మత్స్యకారులను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం అర్ధరాత్రి కాపాడాయి. సాయంత్రం వేటకు వెళ్లినవారు తాము చిక్కుకుపోయినట్లు వీడియోతీసి వాట్సాప్‌లో పోలీసులకు పంపడంతో రెస్క్యూ బృందాన్ని రప్పించి వారిని రక్షించారు. వరద చుట్టుముట్టిన కోలగట్ల గ్రామంలో ఒక భవనంలో చిక్కుకున్న 30 మందిని కూడా రక్షించారు.

కుండపోత వర్షాలతో అనంతపురం జిల్లా అత లాకుతలమైంది. పెన్నా, చిత్రావతి, కుముద్వతి, పాపాఘ్ని, జయమంగళి, కుశావతి, సోమావతి నదులు, మద్దిలేరు, పండమేరు, కూతలేరు లాంటి ప్రధాన వాగులు పరవళ్లు తొక్కుతు న్నాయి. అతిభారీ వర్షాలతో కదిరి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. వేలాది ఎక రాల్లో పంటలు నీటమునిగాయి. తాడిమర్రి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) ఆరుగేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదలుతున్నారు.

చెన్నే కొత్తపల్లి మండలంలో చిత్రావతి నదిలో కారు, జేసీబీ చిక్కుకుపోగా 10 మంది బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఈ విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చొరవతో బెంగ ళూరు నుంచి వైమానికదళ హెలికాప్టర్‌ వచ్చి వారిని రక్షించింది. పరిగి, ధర్మవరం ప్రాంతాల్లో వరద నీటిలో 10 మంది చిక్కుకున్నారు.

భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.రెండు వేల చొప్పున ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సూచించారు. అలాగే.. భారీ వర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన సూచించారు.

పలు రైళ్లు రద్దు: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అతలాకుతలం అవుతుండడంతో అటువైపుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. నెల్లూరు జిల్లా తడ-సూళ్లూరుపేట మధ్య వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-ముంబై సీఎస్‌టీ, గుంతకల్-రేణిగుంట, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - బిట్రగుంట, విజయవాడ-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-విజయవాడ రైళ్లను నేడు రద్దు చేశారు.

అలాగే, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, ఎల్‌టీటీ ముంబై-చెన్నై సెంట్రల్, సీఎస్‌టీ ముంబై-నాగర్‌సోల్, మధురై-ఎల్‌టీటీ ముంబై, చెంగల్పట్టు-కాచిగూడ, చెన్నై సెంట్రల్-ఎల్‌టీటీ ముంబై రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే, త్రివేండ్రం-షాలిమర్, తిరుపతి-హెచ్.నిజాముద్దీన్, కాచిగూడ-మంగళూరు, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్-విజయవాడ తదితర 12 రైళ్లను దారి మళ్లించారు.

నెల్లూరులో గత అర్ధరాత్రి ప్రజలు భయంతో వణికిపోయారు. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరంలో అర్ధరాత్రి దాటాక స్థానిక భగత్‌సింగ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచే కొంతకొంతగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బాధితులు కొందరిని అక్కడి నుంచి జనార్దనరెడ్డి కాలనీలోని టిడ్కో ఇళ్లకు తరలించారు. అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. పిల్లలను పట్టుకుని రక్షించుకునేందుకు నడుము లోతు నీళ్లలో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు కాలనీ వాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. మంత్రి అనిల్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.