AP Covid Report: ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 2,886 మందికి పాజిటివ్‌, 17 మంది మృతి, యాక్టివ్‌గా 25,514 కేసులు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, Oct 31: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్‌ (AP Covid Report) వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా (Coronavirus) నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు 7,88,375కి చేరుకున్నాయి. ప్రస్తుతం 25,514 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు 24 గంటల్లో 17 మంది కోవిడ్ తో మరణించారు. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తం మరణాలు 6,676కి (Covid Deaths) చేరుకున్నాయి.

మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 448 మందికి కరోనా సోకింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 38,899కి, కరోనా మరణాలు 563కి పెరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 376 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 92,376కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 405 కేసులు నమోదయ్యాయి. ఒకరి మృతితో మరణాల సంఖ్య 610కి చేరింది. గుంటూరు జిల్లాలో మరో 385 కేసులు బయటపడ్డాయి.

చిత్తూరు జిల్లాలో మరో 296 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు 778 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా 80 కేసులు బయటపడగా.. కర్నూలు జిల్లాలో 36, కడప జిల్లాలో 148 మందికి వైరస్‌ సోకింది. అనంతపురం జిల్లాలో తాజాగా 151 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 64,436కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 44,160కు చేరింది. విజయనగరం జిల్లాలో 69 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 199 మంది మరణించారు.