COVID-19 Outbreak in India | File Photo

Amaravati, Sep 20: ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా వైరస్‌ (AP Covid Report) బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా విజేతల సంఖ్య 5,41,319కు చేరుకుంది. నిన్న ఒక్కరోజు 70,455 శాంపిళ్లను పరీక్షించగా, 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా (COVID19 positive cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 51,04,131కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,25,514కు (Coronavirus) చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో 78,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 57 కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 5,359కు చేరింది.

తాజాగా కృష్ణాలో 8, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

రికవరీలో మనమే టాప్, దేశంలో భారీ స్థాయిలో పెరిగిన రికవరీ రేటు, తాజాగా 92,605 మందికి కరోనా, 43,03,044కు చేరుకున్న డిశ్చార్జ్ కేసుల సంఖ్య

మాస్కుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే(సింగిల్‌ లేయర్‌వి అయినా సరే) ఉత్తమమైనవని పేర్కొన్నారు. అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్‌)తో తయారు చేసిన మాస్కులు మెడికల్‌ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.