AP Coronavirus Update: కరోనా నుంచి కోలుకున్న ఏపీ, రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, కొత్తగా 326 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌
Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

Amaravati, Jan 1: ఏపీలో రోజురోజుకు కరోనావైరస్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,82,612కు కరోనా కేసులు (AP Coronavirus) చేరాయి. నిన్న ఒక్క రోజు కోవిడ్‌ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. మొత్తం 7108 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇప్పటివరకు కరోనాతో 7108 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,72,266 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 3,238 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,84,085 శాంపిల్స్‌ను పరీక్షించారు.

భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో నాలుగు కేసులు(New Covid Strain in India) నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా నమోదైన నాలుగు కేసులలో మూడు కేసులను బెంగళూరు ల్యాబ్ లో నిర్ధారించారు. నాలుగో కేసును హైదరాబాదు ల్యాబ్ లో గుర్తించారు.

అంత్యక్రియలకు హాజరు, ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా, తెలంగాణ సూర్యాపేటలో కల్లోలం రేపిన కరోనావైరస్, అప్రమత్తమైన వైద్యాధికారులు

ఇప్పటి వరకు 10 కేసులు ఢిల్లీలోని ల్యాబుల్లో, 10 కేసులు బెంగళూరు ల్యాబ్ లో, 5 కేసులు పూణెలోని ల్యాబ్ లో, మూడు కేసులు హైదరాబాద్ ల్యాబులో, ఒక కేసు పశ్చిమబెంగాల్ లోని ల్యాబులో గుర్తించారు. కొత్త స్ట్రైయిన్ కు గురైన వారందరినీ తగిన వైద్య సదుపాయాలు ఉన్న ఐసొలేషన్లలో ఉంచారు.

ఈ కొత్త స్ట్రెయిన్ ఇతర కరోనా స్ట్రెయిన్ల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ స్ట్రెయిన్ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, ఇండియా దేశాలకు విస్తరించింది.