Corona in AP: ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసుల కలవరం, కొత్తగా 1,186 మందికి కోవిడ్, 10 మంది మృ‌తి, జిల్లాల వారీగా కరోనా రిపోర్ట్ ఓ సారి చెక్ చేయండి
COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, Sep 1: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,867 కు చేరింది. గత 24 గంటల్లో 1,396 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 1986962 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,473 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,153,02 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,66,85,469 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 175 కేసులు నమోదు కాగా,చిత్తూరు జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో125 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 111, నెల్లూరు జిల్లాలో 156 కేసులు నమోదయ్యాయి.

ఏపీ ప్రభుత్వం కీలక అడుగు, కర్నూలులో హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు

కోవిడ్ తో గత 14 గంటల్లో కృష్ణలో ఇద్దరు, చిత్తూరులో నలుగురు, చిత్తూరు, ప్రకాశం, విశాఖ,తూర్పు గోదావరిలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 40

చిత్తూరు - 171

తూర్పుగోదావరి - 175

గుంటూరు - 111

కడప - 87

కృష్ణా - 103

కర్నూలు - 13

నెల్లూరు - 156

ప్రకాశం - 125

శ్రీకాకుళం - 50

విశాఖపట్నం - 69

విజయనగరం - 13

పశ్చిమగోదావరి - 73