Coronavirus in AP: నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,502 మందికి కరోనా, 24 గంటల్లో 16 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్ కేసులు
Coronavirus-in-India ( photo-PTI)

Amaravati, August 4: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 63,717 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,502 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,903 కు చేరింది. గత 24 గంటల్లో 1,525 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,90,916 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,883 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,19,702 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,68,73,491 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 208 కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో191 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 120, ప్రకాశం జిల్లాలో 152 కేసులు నమోదయ్యాయి.

జగనన్న విద్యా దీవెనపై ప్రభుత్వానికి హైకోర్టు షాక్, కాలేజీ ఖాతాల్లోనే ఫీజులు జమ చేయాలని ఆదేశాలు, ప్రభుత్వం ఇచ్చిన జీవో 28 కొట్టివేత, జీవో 64లోని సవరణల నిబంధనలు కొట్టివేత

కోవిడ్ తో గత 14 గంటల్లో చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు,కర్నూలు, ప్రకాశంలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 21

చిత్తూరు - 208

తూర్పుగోదావరి - 191

గుంటూరు - 143

కడప - 113

కృష్ణా - 129

కర్నూలు - 20

నెల్లూరు - 260

ప్రకాశం - 152

శ్రీకాకుళం - 38

విశాఖపట్నం - 64

విజయనగరం - 17

పశ్చిమగోదావరి - 146