Corona in AP: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి, కొత్తగా 1,627 కేసులు నమోదు, గడిచిన 24 గంటల్లో 2,017 మంది కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు
Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, July 26: ఏపీలో గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షించగా.. 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (Corona in AP) అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి (Covid in Andhra Pradesh) పెరిగింది. తాజాగా 17 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,017 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు వెల్లడించింది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 45 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది.

బ్రిటన్‌లో మరో కొత్త రకం వైరస్, 16 మందిలో B.1.621 రకం వైరస్‌ గుర్తింపు, భారత్‌లో తాజాగా 39,361 క‌రోనా కేసులు, ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టివ్ కేసులు, కేరళలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

అదే విధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ కొనసాగుతోంది. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్‌ సిబ్బంది ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. మొదటి విడత డోస్‌ తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్‌ కోవిడ్‌ టీకా వేస్తామని వైద్యులు తెలిపారు.