Coronavirus in AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుతుంటే డిశ్చార్జ్ రేటు పెరుగుతోంది, తాజాగా 2,744మంది కోలుకుని క్షేమంగా ఇంటికి, కొత్తగా 1,628మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, July 19: ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,628మందికి పాజిటివ్‌ (Coronavirus in AP) నిర్థారణ అయింది. తాజా కేసులతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724కు చేరింది. మరోవైపు 2,744మంది కరోనా (Covid in AP) నుంచి కోలుకోగా, మొత్తం 19,05,000 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా కరోనాతో చికిత్స పొందుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 22మంది మృతి చెందారు.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురేసి, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,154కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,36, 64, 207 శాంపిల్స్ పరీక్షించారు. తాజా కేసుల్లో తూర్పుగోదావరిలో అత్యధికంగా 291 కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి

ఇక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 38,164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. దేశంలో కొత్తగా 499 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా.. ఇప్పటివరకు 4,14,108మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనానుంచి ఇప్పటివరకు 3,03,08,456మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 40.64 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.