
Amaravathi, June 13: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 222 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,858 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,588 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 14,477 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 82 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 42 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2641 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1865 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
విశాఖలో 4 నెలల శిషువు కోవిడ్19ను జయించాడు. శిషువుకి 18 రోజుల చికిత్స అనంతరం కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని శుక్రవారంసంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడని వైశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ఈ సందర్భంగా విమ్స్ వైద్యులను కలెక్టర్ అభినందించారు.
AP COVID19 Report:

#COVIDUpdates: As on 13/06/2020, 10:00 AM
Positives: 4588
Discharged: 2641
Deceased: 82
Active Cases: 1865#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qW58Kz7LAt
— ArogyaAndhra (@ArogyaAndhra) June 13, 2020
ప్రస్తుతం అన్ లాక్1 అమలులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా సొంతూళ్లకు తరలి వస్తున్నారు. వీరి సంఖ్యను అధికారులు విడిగా చూపుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన మొత్తం 222 కేసుల్లో 186 ఏపి పరిధిలోనివి కాగా, మిగిలిన 36 కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1068 మందికి వైరస్ నిర్ధారణ కాగా, ప్రస్తుతం వీరిలో 546 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 202 మందికి పాజిటివ్ అని తేలగా, ప్రస్తుతం 180 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 3 లక్షలు దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, ఒక్క మహారాష్ట్రలోనే లక్ష మందికి పైగా కోవిడ్ బాధితులు
కరోనావైరస్ వ్యాప్తి కట్టడి, లాక్‌డౌన్ ఎత్తివేత అంశాలకు సంబంధించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 17న ఏపీ మరియు తెలంగాణ సీఎంలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశంలో పాల్గొననున్నారు.