Amaravati, july 25: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 84,858 మంది నమూనాలు పరీక్షించగా 2,252 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,440 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,155 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19,54,765కు చేరుకోగా, రికవరీ అయిన వారి సంఖ్య 19,19,354కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 13,256కు చేరుకుంది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,472 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు (Coronavirus Cases in India) చేరుకుంది. శుక్రవారం రోజు 535మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కు పెరిగింది.
Here's AP Covid Report
Andhra Pradesh reports 2,252 fresh #COVID cases, 2,440 recoveries, and 15 deaths in the past 24 hours.
Active cases: 22,155
Total recoveries: 19,19,354
Death toll: 13,256 pic.twitter.com/e84Fa3CPqo
— ANI (@ANI) July 25, 2021
అదే విధంగా గడిచిన ఒక్కరోజులో 39,972 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,05,43,138 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,08,212 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 43.31 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.