AP CM YS Jagan Mohan Reddy (photo-Twitter)

Eluru, July 25: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ (YSRCP bags Eluru Municipal Corporation) దక్కించుంది. ఏలూరు మేయర్ పీఠం కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడైన ఫలితాల్లో 47 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్‌లో (Eluru Municipal Corporation) మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి.

ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం డివిజన్లలో  47 వైసీపీ ఖాతాలో చేరడంతో ఆ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం లాంఛనం కానుంది. గతంలో ఏకగ్రీవమైన మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో  ఆ పార్టీ 47 డివిజన్లలో గెలుపొందినట్లయింది.

ఏపీ కుర్రాడు సాయి ప్రణీత్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు, ఏపీ వెదర్ మ‌న్ పేరుతో రైతులకు సమాచారం అందిస్తూ మంచి పనిచేస్తున్నారని వెల్లడి, మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని

డివిజన్ల వారీగా ఫలితాలు

►1వ డివిజన్‌ ఎ.రాధిక (వైఎస్సార్‌సీపీ) విజయం

►2వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం.

► 3వ డివిజన్‌ బి.అఖిల (వైఎస్సార్‌సీపీ) విజయం

► 4వ డివిజన్‌ డింపుల్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు

► 5వ డివిజన్‌ జయకర్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం

► 10వ డివిజన్‌ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం

► 11వ డివిజన్‌ కోయ జయగంగ (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం

► 12వ డివిజన్‌ కర్రి శ్రీను (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం

► 17వ డివిజన్‌ టి.పద్మ (వైఎస్సార్‌సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు

► 18వ డివిజన్‌ కేదారేశ్వరి (వెస్సార్‌సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు

► 19వ డివిజన్‌ వై.నాగబాబు (వెస్సార్‌సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం

► 22వ డివిజన్‌ సుధీర్‌బాబు (వైఎస్సార్‌సీపీ) గెలుపు

► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్‌సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు

► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం

► 25వ డివిజన్‌ గుడుపూడి శ్రీను (వైఎస్సార్‌సీపీ) గెలుపు

►26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు(వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం

► 31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (వైఎస్సార్‌సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు

► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్‌సీపీ) గెలుపు

► 33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (వైఎస్సార్‌సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు

►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్‌సీపీ) విజయం

►38వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు

►39వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం

►40వ డివిజన్‌ టి.నాగలక్ష్మి (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం

► 41వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం

► 42వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం

► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్‌సీపీ) గెలుపు

► 45వ డివిజన్‌ ముఖర్జీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం

► 46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు

► 48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు

►50వ డివిజన్‌ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు

టీడీపీ గెలిచిన డివిజన్లు

28, 37, 47