
Amaravathi, May 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గినట్లుగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,880 సాంపిల్స్ ని పరీక్షించగా కేవలం 25 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. ఈ తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2230 కు చేరింది. కాగా, కృష్ణా జిల్లాకు చెందిన కోవిడ్-19 పేషెంట్ ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 50కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 103 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1433 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 747 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు :

కేంద్రం విధించిన లాక్డౌన్-3కి నేటితో కాలం చెల్లిపోనుంది. మే 18 నుంచి మరిన్ని సడలింపులతో లాక్డౌన్-4 అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నివారణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం జగన్ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ప్రతి ఇంటికీ కరపత్రం పంచాలని సూచించారు. రెస్టారెంట్లు, మాల్స్ తిరిగి ప్రారంభమయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశంలో 90 వేలు దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 3 వేలకు చేరువలో కరోనా మరణాలు
లాక్డౌన్ కారణంగా సుమారు రెండు నెలలుగా ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను పున: ప్రారంభించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం భౌతిక దూరం పాటించేలా బస్సు సీటింగ్ లలో మార్పులు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఎప్పట్నించి తిరుగుతాయనేదానిపై కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 4 ప్రకటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.