Coronavirus outbreak in TS (Photo Credits: IANS)

Amaravati, July 21: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు (Corona in Andhra Pradesh) నిర్ధారణ కాగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్‌ (Coronavirus) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,197కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఏపీలో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ (CM YS Jagan) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో భారీగా తగ్గిపోయిన మద్యం వినియోగం, అక్రమ మద్యం అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మూడో వేవ్‌ కరోనా వార్తల నేపథ్యంలో ముందస్తు వ్యూహం అమలు చేయనుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్లానింగ్‌ పేరుతో నిధులు కేటాయించనున్నాయి. ఏపీకి కేటాయించిన రూ.696 కోట్ల నిధుల్లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించనున్నాయి. ఈ నిధులతో 14 జిల్లా ఆస్పత్రుల్లో, 12 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

దీనికోసం రూ.101.14 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఒక్కో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌లో 42 పడకలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రూ.188.72 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తారు.

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం

రాష్ట్రంలో సమర్థ వ్యాక్సినేషన్‌ ద్వారా ఎక్కువ మందికి కోవిడ్‌ టీకాలు ఇవ్వగలిగామని, దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలివ్వాలని ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్‌ డోసులు కేటాయిస్తే 4,63,590 డోసులను మాత్రమే వినియోగించుకున్నందున మిగిలిపోయిన కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కోవిడ్‌ అంక్షల్లో భాగంగా ఈ నెల 22వతేదీ నుంచి రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు