Coronavirus-in-India ( photo-PTI)

Amaravati, July 14: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90,204 పరీక్షలు నిర్వహించగా.. 2,591 కేసులు నిర్ధారణ (Corona in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,29,579 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,057కి చేరింది.

ఒక్క రోజు వ్యవధిలో 3,329 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,90,565కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,32,20,912 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులోయ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అలాగే అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి. జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి, నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం, బెంబేలెత్తుతున్న నదీ పరీవాహక గ్రామాల ప్రజలు, రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు

దేశంలో గత 24 గంటల్లో 38,792 క‌రోనా కేసులు (3,09,46,074కు) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,000 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 624 మంది క‌రోనాతో ప్రాణాలు (624 Deaths in Past 24 Hours) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,11,408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి (COVID-19 in India) ఇప్పటివరకు 3,01,04,720 మంది కోలుకున్నారు. 4,29,946 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 37,14,441 డోసులు వేశారు