COVID in AP: ఏపీలో తాజాగా 2,665 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులు, 16 మంది మృతితో 13వేలు దాటిన కరోనా మృరణాల సంఖ్య
COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, July 11: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 13వేలు దాటింది. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 16 మంది బాధితులు కొవిడ్‌ బారినపడి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,677 పరీక్షలు నిర్వహించగా.. 2,665 కేసులు (COVID in AP) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,22,843 మంది వైరస్‌ (COVID19 cases) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

24 గంటల వ్యవధిలో 3,231 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,81,161కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,29,86,288 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. తూర్పుగోదావరి జిల్లాలో 4, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

విశాఖ జిల్లాలో పెను విషాదం, పెద్దేరు నది దాటుతూ ముగ్గురు మృతి, పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ప్రమాదం

దేశంలో గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 41,506 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24గంటల్లో కరోనాతో 895 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 4,08,040కి (New COVID-19 Cases) చేరింది.

గడిచిన ఒక్కరోజులో 41,526 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ అస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,99,75,064కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,54,118 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 37.60 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.