Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Amaravati, July 7: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా 3,166 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.

కరోనావైరస్ మహమ్మారి ధాటి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి… డెల్టా, లాంబ్డా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరో రూపం లాంబ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.

సింధియాకు మంత్రి పదవి ఖాయమేనా. రేసులో ఎవరెవరు ఉన్నారు, ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ, మంత్రులతో భేటీని రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్‌పై (Lambda Variant) పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.

మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.