Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, July 4: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 94,595 పరీక్షలు నిర్వహించగా.. 3,175 కేసులు నిర్ధారణ (Coronavirus in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,02,923 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 29 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,844కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 3,692 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,54,754కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,23,63,078 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరులో ఆరుగురు మృతి, కృష్ణాలో ఐదుగురు, తూ.గో.లో నలుగురు మృతి చెందారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా, అనంతపురం జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు, కడప, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని వైద్య శాఖ పేర్కొంది.

భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం, ఇక నుంచి శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం, బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైన శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..

దేశంలో కరోనా‌వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు (India logs 43,071 new COVID-19 cases) వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో (Covid Deaths) మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. నిన్న 18,38,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 41.28 కోట్లకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కాస్త పెరిగింది.