COVID-19 Outbreak in India | File Photo

Amaravati, August 10: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ (AP Cornavirus Report) నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా (New Covid-19 cases) తేలింది. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus) 2,35,525 కు చేరింది. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్‌ కేసులున్నాయి.

వైరస్‌ బాధితుల్లో తాజాగా 80 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2116 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా పరీక్షల మార్కు 25 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Here's Corona Update: 

దేశంలో వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు (Coronavirus Cases), ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు (Coronavirus Deaths) న‌మోద‌య్యాయి. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా (New Coronavirus Cases) బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్‌రెడ్డి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీ

ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో క‌రోనా బారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 15 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.