Amaravati, Sep 14: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7,956 మందికి కరోనావైరస్ (AP Coronavirus Report) సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కు (Coronavirus) చేరింది. కొత్తగా 60 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,972 చేరింది.కాగా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికి 46,61,355 టెస్టులు పూర్తయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 61,529 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,956 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్తగా 60 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,972 చేరింది. ఆదివారం 9,764 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇప్పటి వరకు ఏపీలో 4,76,903 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో 9, అనంతపూరంలో 7, కర్నూలులో 5, ప్రకాశంలో 5, విశాఖలో 5, తూర్పు గోదావరిలో 4, కడపలో 4, కృష్ణాలో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 4, నెల్లూరు3, గంటూరులో 2 చొప్పున మరణించారు
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే దాదాపు కోటి మందికి కరోనా వైరస్ సోకి వెళ్లిపోయిందని సీరో సర్వేలో తేలింది.వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్ సోకి, వెళ్లిపోయినట్లు తేలింది. ఇప్పుడు... రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ గురువారం మీడియాకు వెల్లడించారు.
సీర్వో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45వేల శాంపిల్స్ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే వైరస్ సోకి.. దానంతట అదే తగ్గిపోయినట్టు తేలింది. వైరస్ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. విజయనగరం జిల్లా లో అత్యధికంగా 30.6 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీ బాడీ్‌సను గుర్తించారు.
ఆ తర్వాత స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం ఉన్నాయి. ఇక... చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. 12.3 శాతంతో పశ్చిమ గోదావరి ఆఖరి స్థానంలో ఉంది.
తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వేలో 29.8 శాతం రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. మన రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన తొలిదశ సీరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత నుంచి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది!