Cash | Representational Image (Photo Credit: IANS | X

విశాఖపట్నం నుంచి విజయవాడకు ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేసిన పోలీసులకు అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. అయితే, మెషిన్ లో మాత్రం గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.1.30 కోట్లు అని పోలీసులు వెల్లడించారు. అందులోనే 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ ఆటో పట్టుబడింది.

చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం, తాగిన మత్తులో బాంబు నమలడంతో నోట్లో పేలిన కంట్రీ బాంబ్, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి

అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.