Amaravati, June 20: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు (Andhra Pradesh sees 5,646 COVID cases) నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 7,772 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,098 కొత్త కేసులు నమోదు కాగా, అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 127 కేసులు గుర్తించారు. చిత్తూరు (890), పశ్చిమ గోదావరి (761) జిల్లాల్లో 500కి పైన కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 12,319కి పెరిగింది.
ఏపీలో ఇప్పటిదాకా 18,50,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,75,176 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 63,068 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఒక్క రోజే 11 లక్షల వ్యాక్సినేషన్ ఇచ్చి రికార్డ్ సృష్టించారు.
Here's Covid Updates
#COVIDUpdates: 20/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,47,668 పాజిటివ్ కేసు లకు గాను
*17,72,281 మంది డిశ్చార్జ్ కాగా
*12,319 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 63,068#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9cp60MOFJb
— ArogyaAndhra (@ArogyaAndhra) June 20, 2021
In today's ongoing #COVIDVaccination Drive, #AndhraPradesh has administered 11.85 lakh vaccination doses till 5PM#LargestVaccineDrive #APFightsCorona pic.twitter.com/paaQt5SD5r
— ArogyaAndhra (@ArogyaAndhra) June 20, 2021
మొత్తం 2 వేల 232 కేంద్రాల్లో టీకా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గత రికార్డ్‌ని బ్రేక్ చేసింది. గతంలో ఒకే రోజులో 6 లక్షల 28 వేల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 11 లక్షల మార్క్‌ని దాటేసింది. ఉదయం నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. డ్రైవ్ ముగిసే సరికి 12 లక్షల మార్క్‌ను అందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
అంతకుముందు తిరుపతి నెహ్రూ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని అనిల్ సింఘాల్ పరిశీలించారు. వ్యాక్సిన్ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందించగలిగితే ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 96 లక్షల మందికి మొదటి డోసు డోసు వేసినట్లు అనిల్ సింఘాల్ చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని అనిల్ వెల్లడించారు.
థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందనేది నిజం కాకపోవచ్చన్నారు. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావమనే ఉహాగానాలను ఎయిమ్స్ వైద్యులు కొట్టిపారేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 60వేల ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను ఆర్డర్ చేసినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.