Guntur, Nov 22: గుంటూరు జిల్లాలోని పెద కాకానిలో ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడిపై (Andhra Pradesh Shocker) కేసు నమోదు అయింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల ముస్లింపాలెంకు చెందిన షేక్ సుబాని చిల్లరకొట్టు నిర్వహిస్తున్నాడు.
స్థానిక ఎస్టీకాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు అప్పుడప్పుడు చిల్లర కొట్టుకు వస్తూ ఉంటుంది. కామంతో కళ్ళు మూసుకు పోయిన 65 ఏళ్ల సుబాని ఈనెల 16వ తేదీన కొట్టుకు వచ్చిన చిన్నారిని కొట్టు వెనుకకు తీసుకు వెళ్లి కుర్చిలో కూర్చుని బాలికపై లైంగిక దాడి చేశాడు.చిన్నారి ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో స్థానికంగా పంచాయతీ నడిపించారు. పంచాయతీ ద్వారా న్యాయం జరగకపోవడంతో చిన్నారి తల్లి శీలం భవాని శుక్రవారం రాత్రి పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
మేనమామ చూస్తుండగానే, అత్తతో మేనల్లుడి శృంగారం, వద్దని వారించగానే, ఇద్దరూ కలిసి ఏం చేశారంటే..
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు (case registered against Old man) సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితుడైన సుబాని గత నెల రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనా ప్రదేశాన్ని శనివారం దిశ డీఎస్పీ రవికుమార్, సిబ్బందితో సందర్శించి వివరాలు సేకరించారు.