
Kurnool, Feb 24: కర్నూలు జిల్లా గోనెగండ్ల వద్ద కాలువలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. మృతుడి చిన్న కుమారుడు నాగశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు దేవనకొండ మండలం కూకటికొండకు చెందిన గొల్ల గోపాల్‌గా (Kurnool man ) గుర్తించారు.
ఈ ఘటనలో ఆస్తి కోసం కుమారుడే తండ్రిని (Kurnool man kills 60-year-old father) హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఎల్లెల్సీలో పడేశాడు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, ఆ వివరాలను ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ బుధవారం ఎమ్మిగనూరు సీఐ కార్యాలయ ఆవరణలో విలేకరులకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు గొల్ల గోపాల్ భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి వివాహం చేశాడు. ఒంటరితనాన్ని భరించలేక రెండో పెళ్లి చేసుకోవాలని (wanting to marry again) నిర్ణయం తీసుకున్నాడు. మంచి సంబంధం చూడాల్సిందిగా పెళ్లిల్ల పేరయ్య కుమ్మరి ఈరన్నను సంప్రదించాడు. విషయం తెలిసిన గోపాల్ పెద్ద కుమారుడు రంగడు మళ్లీ పెళ్లి వద్దని వారించాడు. 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకోవటమేంటని నిలదీశాడు.
కుమారులతో గొడవపడ్డ గోపాల్.. గత 3 నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో పరువు, ఆస్తి పోతుందని భావించిన రంగడు..పెళ్లిళ్ల పేరయ్యను కలిసి విషయం తెలిపాడు. మా నాన్నకు పెళ్లి సంబంధాలు చూడొద్దని..,ఈ వయస్సుల్లో రెండో పెళ్లి చేసుకుంటే పరువుతో పాటు ఆస్తి కూడా పోతుందని చెప్పాడు. అంతటితో ఆగకుండా గోపాల్‌ను కడతేర్చేందుకు ఈరన్నకు రూ. 1.5 లక్షల సుపారీ ఇచ్చి పథకం రచించాడు.
పథకంలో భాగంగా..ఈనెల 14న పెళ్లి సంబంధం ఉందని నమ్మబలికిన ఈరన్న ఎమ్మిగనూరు రావాలని గొల్ల గోపాల్‌కు చెప్పాడు. అది నమ్మని గోపాల్ ఎమ్మిగనూరు రాగా.. ఈరన్న, బోయ మల్లికార్జున అనే ఆయనను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని గోనెగండ్ల వద్ద నున్న కాలువ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న బాలరంగడు తండ్రితో వాదనకు దిగాడు. ముగ్గురూ కలసి గోపాల్ గొంతుకు లుంగీ బిగించి, పిడిబాకుతో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కాలువలో పడేశారు. మృతదేహం 17వ తేదీన గోనెగండ్ల దగ్గర బయటపడింది.
అనుమానంతో బాలరంగడుని అదుపులో తీసుకొని పోలీసులు విచారించారు. తనతో పాటు మరో ఇద్దరు కలసి హత్య చేసినట్లు బాలరంగడు నేరం అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, పిడిబాకు, రూ.25 వేల నగదను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. హత్య కేసును ఛేదించిన ఎమ్మిగనూరు రూరల్ సీఐ మంజునాథ్, ఎస్‌ఐ సునీల్‌కుమార్, గోనెగండ్ల ఎస్‌ఐ సురేష్‌లను డీఎస్పీ అభినందించారు. రివార్డుకు ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.