Representational Image | (Photo Credits: PTI)

Amaravati, May 3: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా బంధువులు వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేయడంతో (Relatives Harassment In Guntur) వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య (Woman Ends Life) చేసుకుంది. మృతురాలి బంధువులు, పొన్నూరు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నూరు 17వ వార్డులో నివసించే పెళ్లయిన మహిళ (Married woman) స్నానం చేస్తుండగా కొంతమంది బంధువులు రహస్యంగా ఆమెను వీడియో (Video) తీశారు. అనంతరం ఆ వీడియోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు.

వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశారు. రూ.లక్షల్లో డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలంటూ ఆమెను వేధించారు. ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పనికి వెళ్లిన ఆమె భర్త ఇంటికి వచ్చిన భార్య ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అతను అత్తమామలు, బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

అందరూ కలిసి తలుపులు పగలగొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స చేసిన తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలిపింది. అన్ని వివరాలతో ఫోన్‌లో వీడియో తీసి ఉంచానని, చూడాలని చెప్పింది.

నా కూతుర్నే ప్రేమిస్తావా..యువకుడి కాళ్లు చేతులు నరికేసిన ప్రియురాలి బంధువులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ప్రియుడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన

ఆ ఫోన్‌లోని వీడియో చూడగా.. ఆ మహిళ స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఉంది. వారికి రూ.లక్షల్లో ఇచ్చానని, ఇంకా కావాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, చనిపోవాలని ప్రేరేపిస్తున్నారని, అడిగినంత డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నా సెక్స్ కోరిక తీరుస్తావా లేదా..ఒప్పుకోకపోవడంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వృద్ధుడు, బాడీని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేసిన కామాంధుడు, ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన

కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం మృతిచెందింది. తన భార్య మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శరత్‌బాబు చెప్పారు. నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ను చనిపోయిన మహిళ భర్త, బంధువులు కలసి న్యాయం చేయాలని కోరారు.