Anantapur, Mar 29: అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది . స్థానిక యువకుడు వంశీ అతని అనుచరుల దాడిలో శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం.
వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా కక్కలపల్లిలో స్థానిక టమాటా మార్కెట్‌లో వంశీ అనే వ్యక్తితో గొడవపడి వైఎస్సార్‌సీపీ మద్దతుదారు శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం వంశీ తన అనుచరులను తీసుకొచ్చి శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, శ్రీనివాస్ హత్య జరిగిన స్థలాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.